Sri Karthikeya Karavalamba Stotram – శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం

Sri Karthikeya Karavalamba Stotram – శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం

శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం పఠించడం ద్వారా భక్తుని జీవితంలో ధైర్యం, జ్ఞానం, శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. స్కందుడు లేదా మురుగుడు మన కష్టాలను తొలగించి, శత్రు భయాలను నివారించి, ఆరోగ్యం మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. భక్తితో ఈ స్తోత్రం జపిస్తే మనసుకు శాంతి కలిగి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.



ఓం‍కారరూప శరణాశ్రయ శర్వసూనో
సింగార వేల సకలేశ్వర దీనబంధో |
సంతాపనాశన సనాతన శక్తిహస్త
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౧


పంచాద్రివాస సహజా సురసైన్యనాథ
పంచామృతప్రియ గుహ సకలాధివాస |
గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౨


ఆపద్వినాశక కుమారక చారుమూర్తే
ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే |

తాపత్రయాంతక దాయాపర తారకారే 
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౩


వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే
స్వర్లోకనాథ పరిసేవిత శంభు సూనో |
త్రైలోక్యనాయక షడానన భూతపాద
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౪


జ్ఞానస్వరూప సకలాత్మక వేదవేద్య
దీనవనప్రియ నిరమయ దానసింధో |
జ్ఞానప్రియాఽఖిలదురంత మహావనఘ్నే
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || ౫

ఇతి శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం సమాప్తమ్


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు (శ్లోకాలు) పరిశీలించండి.

Post a Comment

0 Comments

Close Menu