Karthika Puranam 14th day in Telugu - కార్తీక పురాణం 14వ అధ్యాయం

కార్తీక పురాణం - 14వ అధ్యాయం

వశిష్ఠ మహాముని, కార్తీక మాసం మహాత్యాన్ని వివరించేందుకు, తనకు తెలిసిన అన్ని విషయాలను జనక మహారాజుకు చెప్పే క్రమంలో ఇలా అన్నారు:


"ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలను సంతోషపరిచేందుకు వృషోత్సవం నిర్వహించడం, శివలింగ సాలగ్రామాల దానం చేయడం, ఉసిరి పండ్లను దక్షిణతో సహా దానం చేయడం వంటి పుణ్యకార్యాలు చేస్తే వెనకటి జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి."

అలా చేసేవారికి కోటి యాగాల ఫలితం దక్కుతుందని, వారి వంశంలోని పితృదేవతలు పైలోకాలు నుంచి చూసి సంతోషిస్తారని అన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శక్తినీయం మేరకు దానం చేయడం, వ్రతం పాటించడం, శివకేశవుల ఆలయంలో దీపారాధన చేయడం, మరియు పూజ రోజున రాత్రంతా జాగారం చేయడం వంటి ఆచరణల ద్వారా పుణ్యం పొందవచ్చు. మరుసటి రోజు బ్రాహ్మణులకు లేదా సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ మరియు పర లోకాల్లో సర్వసుఖాలను పొందుతారని వశిష్ఠుడు వివరించారు.


కార్తీక మాసంలో చేయాల్సిన పనులు గురించి వివరించి, ఏవీ చేయకూడదో కూడా సూచించారు:

1. పరాన్న భక్షణం చేయరాదు; ఇతరుల తినుబండారాలను తినకూడదు.
2. శ్రాద్ధ భోజనం తినడం చేయకూడదు.
3. కార్తీక మాసంలో నెలరోజులూ రాత్రి భోజనం మానుకోవాలి.
4. నీరుల్లి వంటి కూరగాయలు తినరాదు; తిలాదానం తగదు.
5. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు.
6. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రాత్రులు జాగారం చేయాలి.
7. ఈ నెలలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయరాదు; కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది కనుక వేడి నీటితో స్నానం చేయకూడదు.
బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా వేడి నీటితో స్నానం చెయ్యడం హితకరంగా ఉండదు, కానీ అనారోగ్య కారణంగా తప్పనిసరిగా వేడి నీటితో స్నానం చేయాల్సి ఉంటే గంగా, గోదావరి, సరస్వతీ, యమునా నదులను స్మరించి స్నానం చేయాలి. పరిపూర్ణంగా కార్తీక మాస వ్రతం పాటించే వారు పగటిపూట పురాణ పఠనం, హరికథ, సాయంకాలం శివారాధన చేయాలి.


కార్తీక మాస శివ పూజా విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది:

1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి.
2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహయామి.
3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్నాసనం సమర్పయామి.
4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి.
5. ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి.
6. ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి.
7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి.
8. ఓం జగన్నాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి.
9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి.
10. ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి.
11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాలు సమర్పయామి.
12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి.
13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి.
14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి.
15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి.
16. ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి.
17. ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాలు సమర్పయామి.


కార్తీక మాసమంతా శివసన్నిధిలో దీపారాధన, బ్రాహ్మణుల పూజ, తులసి వద్ద కర్పూర హారతులు చేయడం వల్ల మన వంశీయుల పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించేవారు పదిహేను జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు.

ఇట్లు స్కాందపురాణంలో వశిష్ట మహర్షి తెలిపిన కార్తీక మాస మహాత్మ్యం... పద్నాలుగవ అధ్యాయం ముగిసింది.

నిషిద్ధములు: ఇష్టమైన వస్తువులు, ఉసిరి 
దానములు: నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము: యముడు
జపించాల్సిన మంత్రము: ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా


మరిన్ని కార్తీక పురాణాలు చూడండి.

Grid Menu

Post a Comment

0 Comments

Close Menu