బాల స్వామిని బంగారు అయ్యప్పా సాంగ్ లిరిక్స్ - BALA SWAMYNI BANGARU AYYAPPA Song Lyrics


BALA SWAMYNI BANGARU AYYAPPA


బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా
మాలవేసినా మనసారా అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప

నా చిన్ని చేతులు చప్పట్లు కొడితినే
నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తినే
నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తినే
తెలిసి తెలియని తనము నిన్ను తెలుసుకుంటినే
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా. ..
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం

నా ఆటలో నీవే నా స్వామి అయ్యప్ప
నా పాటలో నీవే నా స్వామి అయ్యప్ప
నా మాటలో నీవే స్వామి శరణం అయ్యప్ప
నా చేతలో నీవే స్వామి శరణం అయ్యప్ప
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా.
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప

నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప
నీలో నేనై ఉంటాను అయ్యప్పా
నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప
నన్ను నీ దరిచేర్చే దైవము అయ్యప్పా
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా.
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం

ఈ చిన్ని తనములో నీ మాల వేసినా
నాకెంత బాగ్యమో ఏ జన్మ పుణ్యమో
ఇరిముడికట్టి శబరిమలైకి
నెయ్యాభిషేకం చేస్తాను అయ్యప్పా…
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా.
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం ||3||
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా

మరిన్ని అయ్యప్ప భజనలు చూడండి.

‎Follow the Stotra Sampada (స్తోత్రసంపద) channel on WhatsApp:  Stotra Sampada

Post a Comment

0 Comments

Close Menu